HomeTelugu Trendingనిహారిక భర్తపై పోలీసులకు ఫిర్యాదు

నిహారిక భర్తపై పోలీసులకు ఫిర్యాదు

Complaint against niharika
మెగా డాటర్‌ నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ పై అపార్ట్‌మెంట్‌ వాసులు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది మార్చి నెలలో హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌ నుంచి షేక్‌పేట్‌కు వెళ్లే దారిలో ఉండే ఓ అపార్ట్‌మెంట్‌లో నిహారిక ఫ్లాట్‌ అద్దెకు తీసుకున్నారు. తమ వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన పనుల కోసం ఈ ఫ్లాట్‌ ఉపయోగించుకునేవారు. అయితే, జీహెచ్‌ఎంసీ నిబంధనలు ఉల్లంఘిస్తూ రెసిడెన్షియల్‌ సొసైటీలో వాణిజ్య పరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని. కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా.. గుంపులు గుంపులుగా ఫ్లాట్‌లోకి వస్తున్నారని. దానివల్ల తాము ఎంతో ఇబ్బందులు పడుతున్నామని సదరు అపార్ట్‌మెంట్‌ వాసులందరూ బుధవారం అర్ధరాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, తమ వ్యక్తిగత జీవితానికి అపార్ట్‌మెంట్‌ వాసుల వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని చైతన్య సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరస్పర ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu