మూడో భర్త గురించి వనిత సంచలన వ్యాఖ్యలు


నటి వనితా విజయ్‌కుమార్‌ మూడో భర్తను ఆమె కొట్టి ఇంటి నుంచి తరిమేసినట్లు గత రెండు రోజుల నుంచి వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అసలే వనిత అక్రమంగా పెళ్లి చేసుకుందంటూ అప్పట్లో విమర్శించిన వాళ్లంతా ఈ ఘటనతో మళ్లీ ఆమెను టార్గెట్ చేశారు. దీనికి తోడు సోషల్‌మీడియాలో వనితపై కూడా విపరీతంగా ట్రోల్ జరుగుతోంది. దీనిపై ఆమె స్పందించింది. ‘ప్రేమలో విఫలం కావడం అలవాటై పోయింది. కానీ దేన్నైనా ఎదుర్కొనేందుకు ధైర్యంగా ఉన్నా. ప్రేమని నమ్ముతూ మోసపోవడం చాలా బాధగా ఉంది. ఆ విషయం ఎవరికీ తెలీదు. జీవితం ఒక పాఠం. ఇంకా నేను నేర్చుకుంటున్నా. తప్పుడు వార్తలను నమ్మొద్దు. నేనే తప్పూ చేయలేదు. నా కలలు, జీవిత ఆశలు చెదిరిపోయే స్థితిలో ఉన్నాయి. ఎంతో పాజిటివ్‌గా ఉన్నా, భయంగా ఉంది’ అంటూ తన బాధను వ్యక్తం చేస్తూ యూట్యూబ్‌లో వీడియో విడుదల చేసింది.

మద్యం అలవాటు వల్ల పీటర్‌కి హార్ట్‌ అటాక్ వచ్చింది. అతడి చికిత్స కోసం చాలా డబ్బులు ఖర్చు చేశా. అయినప్పటికీ అతడిలో మార్పు రాలేదు. మళ్లీ డ్రికింగ్, స్మోకింగ్ మొదలుపెట్టాడు. ఓ సారి రక్తపు వాంతులు కావడంతో మళ్లీ హాస్పిటల్‌కు తరలించాను. ఐసీయూలో వారం చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేశారు’. నేను మద్యానికి డబ్బులు ఇవ్వకపోవడంతో పీటర్ సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి ఫోన్ చేసి డబ్బులు అడిగేవాడు. గోవా ట్రిప్‌ నుంచి వచ్చిన తరువాత నా దగ్గర డబ్బులు తీసుకుని వెళ్లిన వాడు ఇప్పటివరకు తిరిగి రాలేదు. అతడికి నాకంటే మద్యం ఎక్కువని అర్ధమైంది. నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా. ఈ సమస్యను కూడా సమర్థంగా ఎదుర్కొని నిలబడతా’ అని వనిత వీడియోలో వెల్లడించారు.

CLICK HERE!! For the aha Latest Updates