చిరు ఆడియో వేడుక ఎక్కడ..?

సినిమా పబ్లిసిటీ విషయంలో ఆడియో ఫంక్షన్ చాలా కీలకమైనది. రాష్ట్రం రెండుగా విడిపోయిన తరువాత ఆడియో ఫంక్షన్ల సంఖ్య పెరిగిందనే చెప్పాలి. కొందరు మాత్రం తమ సినిమా పాటలు నేరుగా మార్కెట్ లోకి రిలీజ్ చేసేస్తున్నారు. అయితే చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ సినిమా ఆడియో ఫంక్షన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్లుగానే సినిమా ఆడియో వేడుక నిర్వహించాలనేది చిత్రబృందం ప్లాన్. అయితే ఈ వేడుక ఎక్కడ జరపాలనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు.

చిరంజీవి ఈ వేడుకను విశాఖపట్టణం లేదా విజయవాడ ప్రాంతాల్లో జరపడానికి ఆసక్తి చూపిస్తున్నారట. కానీ నిర్మాత చరణ్ మాత్రం హైదరాబాద్ లోనే జరిపించాలని భావిస్తున్నారు. దానికి ఓ కారణం ఉంది. ఈ వేడుకకు ఇండస్ట్రీలో ప్రముఖులకు ఆహ్వానం అందింది. వీరి కోసం హైదరాబాద్ అయితేనే పెర్ఫెక్ట్ గా ఉంటుందనేది చరణ్ ఆలోచన. దీన్ని బట్టి చిరంజీవి కూడా హైదరాబాద్ లో జరిపించడానికి ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి. మరో నాలుగు రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ రావాల్సివుంది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here