HomeTelugu Trendingయాంకర్‌ రష్మికి కరోనా పాజిటివ్‌!

యాంకర్‌ రష్మికి కరోనా పాజిటివ్‌!

Corona positive for anchor
టాలీవుడ్‌ ప్రేక్షకులకు యాంకర్‌ రష్మి గౌతమ్ గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెరతో పాటు అప్పుడప్పుడు సినిమాలు సినిమాల్లో మెరుస్తూ యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. రష్మీకి ఇటీవల స్వల్ప అనారోగ్య లక్షణాలు కనిపించగా కరోనా టెస్ట్ చేయించుకుందని, ఆ రిపోర్ట్‌లో పాజిటివ్ అని తేలడంతో ప్రస్తుతం ఆమె షూటింగ్స్‌ అన్నింటికీ దూరంగా ఉంటోందని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు సంబంధించి అక్టోబర్ 23వ తేదీన అలాగే అక్టోబర్ 28 తేదీన జరిగే షూటింగ్స్‌ను క్యాన్సిల్ చేసినట్టు యూనిట్ వర్గాలు పేర్కొనడంతో జనాల్లో అనుమానాలు మొదలయ్యాయి. అయితే తనకు కరోనా సోకినట్లు రష్మీ గౌతమ్ అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం ఈ వార్త వైరల్‌గా అవుతోంది.

క్లాప్ బోర్డ్‌తో గుత్తాజ్వాల స్పెషల్ ఇంటర్వ్యూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu