క్లాప్ బోర్డ్‌తో గుత్తాజ్వాల స్పెషల్ ఇంటర్వ్యూ

ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జాతీయస్థాయిలో పోటీ చేసిన ఈమె పలు పతకాలను సాధించింది. టాలీవుడ్‌లో నితిన్ హీరోగా నటించిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో డ్యాన్స్‌తో అలరించింది. గత కొన్ని రోజులుగా తమిళ హీరో విష్ణు విశాల్‌తో ప్రేమలో ఉన్న గుత్తాజ్వాల మొన్న ఈ మధ్యే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆరంభంలో గుత్తా జ్వాల తన సొంత ఖర్చుతో బ్యాడ్మింటన్ అకాడమీని స్థాపించింది. కాంట్రవర్సీలకు ఇకపై దూరంగా ఉండాలనుకుంటున్నట్టు కూడా అప్పట్లో తెలిపింది. డబుల్స్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్‌కు అవకాశాలు రావడం లేదని, ప్రోత్సాహం లేకపోవడం బాధాకరం అంటోంది. క్లాప్‌బోర్డ్‌తో మరిన్ని విషయాలు పంచుకుంది గుత్తాజ్వాల.

CLICK HERE!! For the aha Latest Updates