HomeTelugu Trendingనాగశౌర్యకు కరోనా టెన్షన్

నాగశౌర్యకు కరోనా టెన్షన్

7 19

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. ఈ నేపధ్యంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోవడం జనాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు కరోనా సెగ టాలీవుడ్‌నీ తాకడంతో ఒక్కసారిగా అంతా ఉలిక్కిపడ్డారు. ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త బండ్ల గణేష్ కరోనా బారిన పడటంతో టాలీవుడ్ మొత్తం అలర్ట్ అయింది.

తనకు కరోనా సోకిందనే విషయం తెలియక గత వారంరోజులుగా ఎంతోమందిని కలిశారు బండ్ల గణేష్. దీంతో ఆయనతో కాంటాక్ట్ అయిన వాళ్ళతో పాటు కుటుంబ సబ్యులకు కూడా కరోనా టెస్టులు చేస్తున్నారు. అయితే బండ్ల గణేష్ కరోనా బారిన పడ్డారనే విషయం తెలియగానే.. టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య, ఆయన ఫ్యామిలీ మొత్తానికి టెన్షన్ పట్టుకుందని ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

బండ్ల గణేష్ ఉండే స్ట్రీట్‌లోనే నాగశౌర్య ఫ్యామిలీ కూడా నివాసముంటోంది. దాంతో ఆయనకు కూడా కరోనా భయం పట్టుకుందని టాక్‌. అంతేకాదు నాగశౌర్య ఫ్యామిలీ ప్రస్తుతం అక్కడి నుంచి వేరే చోటకు అర్జెంట్‌గా షిప్ట్ అయిపోయారని కూడా ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. బండ్ల గణేష్‌కి కరోనా పాజిటివ్ అని తెలిసి టాలీవుడ్ ప్రముఖులు కూడా ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu