HomeTelugu Trendingమాస్‌ మహారాజాకు నో చెప్పిన 'మాస్టర్' బ్యూటీ

మాస్‌ మహారాజాకు నో చెప్పిన ‘మాస్టర్’ బ్యూటీ

4 6
టాలీవుడ్‌ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో ‘హీరో’ అనే చిత్రంలో హీరోయిన్ గా సెలెక్ట్ మలయాళీ బ్యూటీ మాళవిక మోహన్. అయితే స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా ఒక షెడ్యూల్ పూర్తయిన తర్వాత ఓవర్ బడ్జెట్ అవుతుందని ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని పక్కన పెట్టేశారు. అయితే తాజాగా ఈ బ్యూటీకి మరొక క్రేజీ టాలీవుడ్ ఆఫర్ వచ్చిందట.

మాస్ మహారాజా రవితేజ ‘రాక్షసుడు’ ఫేం రమేష్ వర్మ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాని కోనేరు సత్యనారాయణ తనయుడు యువ హీరో హవీష్ నిర్మించనున్నాడు. ‘క్రాక్’ సినిమా తరువాత రవితేజ ఈ సినిమా ప్రారంభించే అయ్యే అవకాశాలు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా మాళవిక మోహన్ ని నటింపజేయాలని చిత్ర యూనిట్ అమ్మడిని సంప్రదించారట. అయితే మాళవిక ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించిందట. ఇప్పట్లో తెలుగు సినిమాల్లో నటించే ఉద్దేశ్యం లేదని చెప్పుకొచ్చిందట ఈ అమ్మడు. మాళవిక మోహన్ ప్రస్తుతం ‘ఇళయదళపతి’ విజయ్ – ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘మాస్టర్’ సినిమాలో నటిస్తోంది. కాగా ఈ ప్రాజెక్టు కూడా ఇప్పటికే పూర్తయిపోయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu