HomeTelugu Trendingభారత్‌లో 724కు చేరిన కరోనా కేసులు..

భారత్‌లో 724కు చేరిన కరోనా కేసులు..

2 26
కరోనా వైరస్‌ కేసుల సంఖ్య భారత్‌లో రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే 27రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వైరస్‌ వ్యాపించింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ నిర్థారణ కేసుల సంఖ్య శుక్రవారం ఉదయానికి 724కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. కొవిడ్‌-19 కారణంగా దేశంలో ఇప్పటివరకు మొత్తం 17మంది మృతి చెందినట్లు ప్రకటించింది. వైరస్‌ సోకిన మొత్తం బాధితుల్లో 67మంది కోలుకోగా ప్రస్తుతం 640మంది చికిత్స పొందుతున్నారు. దేశవ్యాప్తంగా కొవిడ్‌-19 సోకినవారిలో 47మంది విదేశీయులే ఉన్నారు. వీరిలో ఒక్క తెలంగాణలోనే పదిమంది ఉన్నారు.

మహారాష్ట్రలో కొవిడ్‌-19 తీవ్రత ఎక్కువగా ఉంది. ఇక్కడ 130కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా నలుగురు మరణించారు. గుజరాత్‌లో 43కేసులు నమోదుకాగా ముగ్గురు మరణించారు. కర్ణాటకలో 55కేసులు నమోదుకాగా ఇద్దరు మరణించారు. కేరళలో దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. కేరళలో శుక్రవారంబనాటికి కరోనా కేసుల సంఖ్య 137కు చేరింది. ఇక తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 44కి చేరింది. మొత్తం బాధితుల్లో పది మంది విదేశీయులే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 12కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. రాజస్థాన్‌లో 41కేసులు నమోదుకాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 40 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu