HomeTelugu Trending'మళ్లీ పెళ్లి' ట్రైలర్‌

‘మళ్లీ పెళ్లి’ ట్రైలర్‌

Malli Pelli Trailer

సీనియర్ నటులు నరేశ్, పవిత్రా లోకేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘మళ్లీ పెళ్లి’. ఎంఎస్ రాజు డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని విజయ కృష్ణ మూవీస్‌ బ్యానర్ పై నరేశ్ సొంతంగా నిర్మిస్తున్నారు. తన వైవాహిక జీవితాన్నే నరేశ్ తెరపై చూపెట్టనున్నారు. కొన్నాళ్లుగా కలిసి ఉంటూ, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న నరేశ్, పవిత్ర జీవితంలో చోటుచేసుకున్న పలు సంఘటనల సమాహారమే ఈ చిత్రం అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.

నరేంద్రగా నరేశ్, పార్వతిగా పవిత్ర కనిపిస్తున్నారు. నరేశ్ నిజ జీవితంలో మూడో భార్య పాత్రలో వనితా విజయ్ కుమార్ నటించారు. ‘పార్వతీ, మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటాడా’ అని నరేశ్.. పవిత్రను అడగడంతో మొదలైన ట్రైలర్ లో వారి మధ్య పరిచయం ప్రేమగా మారడం నుంచి ‘మా’ ఎలక్షన్స్, బెంగళూరు హోటల్ ఎపిసోడ్, మూడో భార్యను ఆయన తన్నడం వరకు చూపెట్టారు.

కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులతో సినిమాను బోల్డ్ గా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హీరో (నరేశ్) వెయ్యి కోట్ల ఆస్తిపై ఆయన మూడో భార్య కన్నేసినట్టు చూపించేలా ముసలోడు అని కనికరించి పెళ్లి చేసుకుంటే.. అంటూ వనితా విజయ్ కుమార్ తో డైలాగ్ చెప్పించారు. నటి అన్నపూర్ణ డైలాగులు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ మూవీలో సహజనటి జయసుధ, శరత్‌ బాబు, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.

ప్రభాస్ ఆదిపురుష్‌ ట్రైలర్‌

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu