‘వాల్మీకి’ టీజర్‌ వచ్చేస్తుంది

యంగ్‌ హీరో వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న ‘వాల్మీకి’ ప్రీ టీజర్‌ సోమవారం సాయంత్రం 5:18గంటలకు విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని వరుణ్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. ఈ చిత్రానికి హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు.14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ దీనిని నిర్మిస్తోంది. మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. తమిళ చిత్రం ‘జిగర్తాండ’ కు తెలుగు రీమేక్‌ ఇది.

ఈ చిత్రాన్ని సెప్టెంబరు 6న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వరుణ్‌ ఇటీవల ‘f2’ సినిమాతో హిట్‌ కొట్టిన విషయం తెలిసిందే. దాని తర్వాత వరుణ్‌ నటిస్తున్న చిత్రమిది. హరీశ్‌ శంకర్‌ మెగా ఫ్యామిలీకి ‘గబ్బర్‌ సింగ్‌’, ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’ వంటి హిట్‌ చిత్రాలను అందించారు. దీంతో ‘వాల్మీకి’పై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి.