HomeTelugu Trendingస్కంద: కల్ట్‌ మామా లిరికల్‌ సాంగ్‌ విడుదల

స్కంద: కల్ట్‌ మామా లిరికల్‌ సాంగ్‌ విడుదల

Only Rams dances are good in Skandas Cult Mama song

బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో రామ్‌ పోతినేని హీరోగా నటిస్తున్న చిత్రం స్కంద. ఈ సినిమా నుండి కల్ట్‌ మామా లిరికల్‌ సాంగ్‌ని వినాయక చవితి సందర్భంగా రిలీజ్‌ చేశారు. థమన్‌ స్వర పరిచిన ఈ మాస్‌ గీతాన్ని.. హేమచంద్ర, రమ్య బెహరా, మహా ఆలపించారు. అనంత్ శ్రీరామ్‌ లిరిక్స్‌ క్యాచీగా ఉన్నాయి.

ఇక రామ్‌ పోతినేని ఎప్పటిలానే తన ఎనర్జిటిక్‌ స్టెప్స్‌తో ఊపేశాడు. ఇక ఈ స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్‌ ఐటెం గర్ల్‌ ఊర్వశి రౌటెలా నర్తించింది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. థమన్‌ సంగీతం అందించాడు.

ఇప్పటికే రిలీజైన అన్ని పాటలు చార్ట్‌ బస్టర్‌లుగా నిలిచాయి. ఈ సినిమాపై భారీగానే హైప్స్‌ ఉన్నాయి. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందు రానుంది. ఇక అదే రోజున చంద్రముఖి-2 కూడా రిలీజ్‌ కాబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu