HomeTelugu Trending'దసరా' రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

‘దసరా’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

dasara movie release date a
నేచురల్‌ స్టార్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో నాని ఊరమాస్ లుక్ తో కనిపించనున్నాడు. నాని ఈ స్థాయి లుక్ తో కనిపించనుండటం ఇదే తొలిసారి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ చాలా వరకూ జరుపుకుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీను ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 30వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు చెబుతూ, అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు. సిల్క్ స్మిత బ్లాక్ అండ్ వైట్ పోస్టర్ ఉన్న గోడకి ఆనుకుని అరుగుపై కూర్చున్న నాని కనిపిస్తున్నాడు.

ఈ పోస్టర్ చూస్తుంటే కథ ఏ కాలంలో జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా అలరించనుంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి , సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

20220826fr630873a5043bf

Recent Articles English

Gallery

Recent Articles Telugu