HomeTelugu Trending'వకీల్‌సాబ్‌' నటి నివేదా థామస్‌కు కరోనా పాజిటివ్‌

‘వకీల్‌సాబ్‌’ నటి నివేదా థామస్‌కు కరోనా పాజిటివ్‌

Corona tested positive for

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయనాయకులు, సినీ ప్రముఖులు, క్రీడారంగంలోనూ ఈ వైరస్‌ ప్రభావం కనిపిస్తోంది. తాజాగా పవర్‌ స్టార్‌ పవణ్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన ‘వకీల్‌ సాబ్‌’ సినిమాలో కీలక పాత్రలో నటించిన హీరోయిన్‌ నివేదా థామస్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె వెల్లడించింది. “నాకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ప్రస్తుతం సెల్ప్‌ క్వారంటైన్‌లో ఉన్నాను. డాక్టర్లు ఇచ్చిన సలహాలు పాటిస్తున్నాను. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో వస్తాను. నాకు సపోర్ట్ గా నిలిచిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా నాపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న మెడికల్‌ టీంకు కృతజ్ఙతలు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించి.. క్షేమంగా ఉండాలి” అని నివేదా థామస్‌ ట్విట్టర్‌ వేదికగా పేర్కొంది. నివేదా థామస్‌కు కరోనా సోకడంతో వకీల్‌ సాబ్‌ మూవీ యూనిట్‌లో టెన్షన్‌ మొదలైంది. కాగా ఈ సినిమా ఏప్రిల్‌ 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu