బల్గేరియాకు పవన్ పయనం!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వీలైనంత తొందరగా సినిమా షూటింగ్ పూర్తి చేయాలని పవన్ చాలా వరకు తన కాల్షీట్స్ ఈ సినిమా కోసమే కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ బల్గేరియాలో ప్లాన్ చేశారు. దానికోసం చిత్రబృందం బల్గేరియా పయనమైంది. అక్కడ 20 రోజుల పాటు సినిమా షూటింగ్ జరపనున్నారు. అందులో కొన్ని సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలను అలానే రెండు పాటలను చిత్రీకరించనున్నారు.
ఈ సినిమాలో పవన్ కు జంటగా కీర్తి సురేష్, అను ఎమ్మాన్యూయల్ లు నటించనున్నారు. వారితో పాటు ఆది పినిశెట్టి, ఖుష్బూ, వెంకటేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమాలో పవన్ ఒక పాటను కూడా పాడబోతున్నారు. మొదట ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు క్రిస్మస్, లేదా సంక్రాంతి బరిలోకి దింపనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ మాత్రం అక్టోబర్ నాటికి సినిమా షూటింగ్ పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టినట్లు తెలుస్తోంది. నవంబర్ నుండి పవన్ తన కొత్త సినిమా కోసం సెట్స్ పైకి వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నాడు.