సిక్స్ ప్యాక్ కోసం యంగ్ హీరో!

‘హైపర్’ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో రామ్ తన కథల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆ నేపధ్యంలో తనకు ‘నేను శైలజ’ వంటి హిట్ సినిమా ఇచ్చిన దర్శకుడు కిషోర్ తిరుమలతోనే పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను అనౌన్స్ చేసినా.. ఇప్పటివరకు సెట్స్ పైకి తీసుకువెళ్లలేదు. రామ్ ఇలా ఆలస్యం చేయడానికి ఓ కారణం ఉందట.

ఈ సినిమా కోసం రామ్ సిక్స్ ప్యాక్ ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ దిశగా రామ్ వర్కవుట్స్ చేస్తున్నాడు. సిక్స్ ప్యాక్ విషయంలో ఓకే అనుకోగానే సెట్స్ పైకి వెళ్తారని తెలుస్తోంది. రామ్ ఇప్పటివరకు లవర్ బాయ్ గా, పక్కింటి కుర్రాడిగానే కనిపించాడు. కానీ ఈ సినిమాలో మాత్రం సిక్స్ ప్యాక్ తో కనిపించడానికి రెడీ అయిపోతున్నాడు. ఈ సినిమాలో రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్, మేఘా ఆకాష్ లు నటిస్తున్నారు.