HomeTelugu Trendingబ్రహ్మాస్త్రం: 'దేవ దేవ' సాంగ్‌ విడుదల

బ్రహ్మాస్త్రం: ‘దేవ దేవ’ సాంగ్‌ విడుదల

Deva Deva song from BRAHMA
బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమా తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’ పేరుతో విడుదల కానుంది. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, అలియా భట్ తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున, నాగిన్‌ బ్యూటీ మౌనీ రాయ్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ కూడా ఈ సినిమాలో కనిపిస్తారని వినికిడి.

ఇప్పటి వరుకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్‌, సాంగ్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ‘దేవ దేవ’ అనే మరో పాటను విడుదల చేశారు. ప్రీతమ్‌ స్వరపరిచిన ఈ సాంగ్‌కు చంద్రబోస్‌ సాహిత్యం అందించారు. శ్రీరామ చంద్ర, జోనితా గాంధీ ఆలపించిన ఈ పాట ఆధ్యాత్మికతతో ఉల్లాసభరితంగా సాగింది.

‘ఈ పాటను విడుదల చేసేందుకు శ్రావణ సోమవారం కంటే మంచి సమయం ఉందని నేను అనుకోను’ అని డైరెక్టర్‌ అయాన్ ముఖర్జీ పేర్కొన్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 9న.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుద‌ల కానుంది. తెలుగులో ఈ చిత్రానికి దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu