బ్రహ్మస్త్ర: ‘దేవ దేవ’ సాంగ్‌ టీజర్‌ విడుదల


బాలీవుడ్ స్టార్ క‌పుల్ ర‌ణ్‌బీర్ సింగ్‌, అలియాభ‌ట్ ప్రధాన పాత్ర‌ల్లో న‌టించిన తాజా చిత్రం ‘బ్ర‌హ్మ‌స్త్ర’. అయాన్ ముఖ‌ర్జీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా తెలుగులో బ్ర‌హ్మ‌స్త్రం పేరుతో విడుద‌ల కానుంది. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో రాజ‌మౌళి విడుద‌ల చేస్తున్నాడు. నాగార్జున కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. ఇప్ప‌టికే చిత్రం నుండి విడుద‌లైన పోస్ట‌ర్‌లు, ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి. ఇటీవ‌లే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌ల‌ను జ‌రుపుకుంటుంది. సెప్టెంబ‌ర్ 9న ఈ సినిమా విడుద‌ల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర‌బృందం వ‌రుస అప్‌డేట్ల‌ను ప్ర‌క‌టిస్తుంది. మేక‌ర్స్ మ‌రో అప్‌డేట్‌ను ప్ర‌క‌టించారు.

ఈ చిత్రంలోని ‘దేవ దేవ’ అంటూ సాగే పాట టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. తాజాగా విడుద‌లైన టీజ‌ర్ ఆస‌క్తిని క్రియేట్ చేస్తుంది. ఈ పాట ఫుల్ లిరిక‌ల్ సాంగ్ ఆగ‌స్ట్ 5న విడుద‌ల కానుంది. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కానుంది. బిగ్‌బీ అమితాబ్, నాగార్జున‌ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించ‌గా మౌనీరాయ్ విల‌న్ పాత్ర‌లో న‌టించింది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌, ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌, ప్రైమ్ ఫోక‌స్‌, స్టార్ లైట్ పిక్చ‌ర్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

CLICK HERE!! For the aha Latest Updates