HomeTelugu TrendingDevara: షూటింగ్‌ వీడియో లీక్‌

Devara: షూటింగ్‌ వీడియో లీక్‌

Devara leaked video viralDevara leaked video viral: జూనియర్‌ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న పాన్ ఇండియా స్థాయిలో వస్తోన్న మూవీ రెండు పార్టులుగా విడుదల కానుంది. దేవర పార్టు- 1 అక్టోబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ భైర పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ షూటింగ్‌ నుండి లీకైన ఓ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బ్లాక్ షర్ట్‌, లుంగీలో ఉన్న తారక్‌ ఓ సెలయేరులో నుంచి నడుచుకుంటూ వస్తున్న వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

దేవర- 1 డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. దేవర ఒరిజినల్‌ సౌండ్ ట్రాక్‌ AllHailTheTigerను విడుదల చేయగా.. అదిరిపోయే మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో కంపోజ్‌ చేసిన AllHailTheTiger గూస్ బంప్స్‌ తెప్పిస్తోంది.

ప్రకాశ్ రాజ్‌, షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్‌, మురళీ శర్మ ఇతర కీ రోల్స్‌ పోషిస్తున్నారు. ఈ మూవీకి అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్‌ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu