HomeTelugu Trending''3 రోజెస్'' టీజర్‌

”3 రోజెస్” టీజర్‌

3 Roses teaser

ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో ”3 రోజెస్” అనే సరికొత్త వెబ్ సిరీస్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి డిజిటల్ వరల్డ్ లో అడుగుపెడుతున్నారు. ఇందులో పాయల్ రాజ్ పుత్ – ఈషా రెబ్బా – పూర్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు డిజిటల్ స్పేస్ లో ముగ్గురు హీరోయిన్స్ తో చేస్తున్న తొలి ఫీమేల్ సెంట్రిక్ ఒరిజినల్ సిరీస్ ఇదేనని తెలుస్తోంది.

నవంబర్ 12న ఈ సిరీస్ ని ఆహా లో ప్రీమియర్ గా స్ట్రీమింగ్ ని పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. రీతూ – జాన్వీ – ఇందు అనే ముగ్గురు స్వతంత్ర భావాలు కలిగిన ఈ జనరేషన్ అమ్మాయిల జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలతో ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ని రూపొందించారని టీజర్ చూస్తే అర్థం అవుతుంది.

ముగ్గురు బ్యూటీస్ గ్లామర్ డోస్ పెంచి కనువిందు చేస్తున్నారు. ముఖ్యంగా పాయల్ రాజ్ పుత్ రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది. ఇందులో ప్రిన్స్ , సంగీత్ శోభన్ , వైవా హర్ష, సత్యం రాజేష్ , హేమ, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu