HomeTelugu Big Stories'దేవర'లో సొరచేప ఫైట్‌.. సినిమాకే హైలైట్!

‘దేవర’లో సొరచేప ఫైట్‌.. సినిమాకే హైలైట్!

Devara Movie Update

టాలీవుడ్‌లో మరోసారి సోరచేప ఫైట్‌ రిపీట్‌ కానుంది. ప్రభాస్‌ హీరోగా నటించిన ఛత్రపతి సినిమాలో సొరచేప ఫైట్‌ ఎంత హైలైట్‌ అయిందో చెప్పనవసరం లేదు. తాజాగా అలాంటి భారీ సీన్‌ ఒకటి తెరకెక్కతున్నట్లు టాక్‌. జూనియార్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది.

ఈ సినిమాలో కొరటాల ఓ భారీ యాక్షన్‌ సీన్‌ను డిజైన్‌ చేశాడట. అది కూడా సొరచేపతో. దేవర సినిమా సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సముద్రంలో ఓ భారీ షార్క్‌తో తారక్‌ ఫైట్‌ ఎపిసోడ్‌ను ప్లాన్‌ చేస్తున్నాడట. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన పనులు కూడా స్టార్ట్‌ అయినట్లు తెలుస్తుంది. ఈ సీన్‌ ఓ రెంజ్‌లో ఉంటుంది అని. ఈ సినిమాకే ఈ సీన్‌ హైలైట్‌ అని అంటున్నారు.

ఈ సినిమాతో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుంది. యువసుధ ఆర్ట్స్‌, ఎన్టీఆర్‌ ఆర్స్ట్ బ్యానర్‌లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా దాదాపు సగం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఎట్టిపరిస్థితుల్లో ఈ ఏడాదిలోపు షూటింగ్‌ పూర్తి చేసుకుని ఆపై నెల, రెండు నెలలు పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ జరపాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తుంది. ఇక ఆచార్యతో కోలుకోలేని దెబ్బతిన్న కొరటాల శివ దేవరతో ఎలాగైనా గ్రాండ్‌ కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడు. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా కనిపించబోతున్న ఈ సినిమా ఏప్రిల్‌ 5న రిలీజ్‌ కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu