మెగాహీరోకి నిరాశ తప్పలేదు!

మెగామేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన ‘విన్నర్’ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి చిరంజీవి, పవన్ కల్యాణ్ లను ప్రత్యేకంగా ఆహ్వానించాడట తేజు. మీలో ఎవరు కోటీశ్వరుడు షో పనుల్లో కొంచెం బిజీగా ఉండడంతో రాలేకపోవచ్చని చిరు ముందుగానే చెప్పేశాడట. ఇక కాటమరాయుడు సినిమా షూటింగ్ లో బిజీగా గడుపుతున్న పవన్ రావడానికి ప్రయత్నిస్తానని చెప్పినట్లు సమాచారం.

దీంతో మావయ్య వస్తాడేమో అని ఫంక్షన్ ఆఖరి నిమిషం వరకు తేజు ఎదురుచూసాడట. కానీ ఆయన రాకపోవడం తేజుని నిరాశ పరిచింది. అలా అని తన ఫీలింగ్స్ బయటపెట్టకుండా పవన్ గురించి మాట్లాడి అభిమానుల్లో ఉత్సాహాన్ని కలిగించారు. ఫంక్షన్ ఎంత గ్రాండ్ గా జరిగినా.. పవన్ రాలేదనే వెలితి మాత్రం తేజులో ఉందని చెప్పుకుంటున్నారు.