HomeTelugu Newsఅభిమానుల కోసం.. డ్రైవర్‌గా మారిన దేవరకొండ

అభిమానుల కోసం.. డ్రైవర్‌గా మారిన దేవరకొండ

7 12
యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ అభిమానుల కోసం డ్రైవర్‌గా మారారు. ఆయన నటించిన ‘టాక్సీవాలా’ చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్‌ డ్రైవర్‌గా కనిపించారు ఈ చిత్రం విమర్శకుల నుంచి మంచి టాక్‌ అందుకుంది. ఈ నేపథ్యంలో విజయ్‌ ఆనందం వ్యక్తం చేశారు. సంతోషంలో అభిమానుల కోసం డ్రైవర్‌గా మారిపోయారు. ఈ మేరకు ఆయన తాజాగా ట్వీట్‌ చేశారు.

కారు నడుపుతున్న వీడియోను షేర్‌ చేశారు. అందులో పోలీసు అధికారిణి, గాయకురాలు, పాత్రికేయురాలు.. ఇలా అనేక మంది ప్రయాణించారు. వారితో విజయ్‌ చాలా స్నేహంగా మాట్లాడారు. ‘మీరు మళ్లీ నా సినిమాను ఇష్టపడ్డారు. థియేటర్‌ను మీ నవ్వులతో నింపారు. అందుకే మీ డ్రైవర్‌గా మారాలని నిర్ణయించుకున్నా’అని విజయ్‌ ట్వీట్‌ చేశారు. పూర్తి వీడియోను త్వరలోనే షేర్‌ చేస్తానని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu