HomeTelugu Big Storiesఫ్యాన్సీ రేటుకు 'అర్జున్ రెడ్డి' థియేట్రిక‌ల్ రైట్స్!

ఫ్యాన్సీ రేటుకు ‘అర్జున్ రెడ్డి’ థియేట్రిక‌ల్ రైట్స్!

పెళ్ళిచూపులు చిత్రం సన్సేషనల్ హిట్ సాధించిన హీరో విజయ్ దేవర కొండ కథానాయకుడుగా రూపొందుతున్న చిత్రం ‘అర్జున్ రెడ్డి’. షాలిని హీరోయిన్‌గా న‌టిస్తుంది. భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ణ‌య్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభం నుండి ప్రేక్ష‌కుల్లో అంచ‌నాల‌ను పెంచుతుంది. విల‌క్ష‌ణ పాత్ర‌లు చేయ‌డానికి ఆస‌క్తి చూపే హీరో విజ‌య్ దేవ‌ర కొండ ఈ చిత్రంలో యారోగెంట్ మెడిక‌ల్ స్టూడెంట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడు. మంచి ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని నైజాంలో ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ ఏషియ‌న్ ఫిలింస్‌తో పాటు కె.ఎఫ్‌.సి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల చేస్తున్నాయి.

పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాపై వ‌చ్చిన అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే సినిమా ప్రీ రిలీజ్ బిజెనెస్‌కు క్రేజ్ ఏర్ప‌డింది. విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి 2 చిత్రాన్ని విడుద‌ల చేసిన ఏషియ‌న్ ఫిలింస్ అధినేత సునీల్ నారంగ్ ఈ సినిమా థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను ఫ్యాన్సీ రేటు చెల్లించి సొంతం చేసుకున్నారు. ర‌ధ‌న్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో త్వ‌ర‌లో మార్క‌ట్లోకి విడుద‌ల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu