
Chahal Dhanashree divorce rumors:
భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య, కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ విడాకుల వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. వీరి మధ్య విభేదాలు తలెత్తాయనే ఊహాగానాలు వ్యాప్తిలో ఉన్నాయి. అయితే, చాహల్ గానీ, ధనశ్రీ గానీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.
అన్ని ఊహాగానాల మూలం సోషల్ మీడియానే. చాహల్, ధనశ్రీ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరిని ఒకరు అన్‌ఫాలో చేయడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి. అంతేకాదు, చాహల్ తన భార్యతో ఉన్న ఫొటోలు కూడా తొలగించేశారు. అయితే, ధనశ్రీ తన అకౌంట్‌లో మాత్రం వారి ఫొటోల్ని ఇప్పటికీ ఉంచారు. వీటిని గమనించిన అభిమానులు వీరి విడాకులపై చర్చ మొదలుపెట్టారు.
Marriage is bad for men and divorce is the worst.
Chahal to pay 60 Crores alimony to an empowered reel maker.#AlimonyScam #AlimonyIsBloodMoney #MarriageStrike #1CroreAlimony pic.twitter.com/G9mKf38goA
— SIFF – Soul Searching. (@DXTMRA) February 19, 2025
ఈ రూమర్స్ పెరిగే కొద్దీ కొన్ని వదంతులు తెరపైకి వచ్చాయి. చాహల్ తన భార్య ధనశ్రీకి విడాకుల సమయంలో రూ. 60 కోట్లు అలిమొనీ (పెద్ద మొత్తంలో పరిహారం) చెల్లించాల్సి ఉంటుందనే వార్త వైరల్ అయింది. అయితే, ఇది నిర్ధారించబడిన సమాచారం కాదు. ఎక్కడా దీనికి సంబంధించిన అధికారిక సమాచారం బయటకు రాలేదు.
ఈ రూమర్లకు స్పందించిన ధనశ్రీ, తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, “నాకు తప్పని తప్పులను అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. నా గౌరవాన్ని కించపరుస్తున్నారు” అంటూ తనపై నెగటివ్ ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. అయితే, ఆమె చాహల్ పేరు ప్రస్తావించలేదు.
2020 కరోనా లాక్‌డౌన్ సమయంలో చాహల్, ధనశ్రీ డాన్స్ క్లాసుల ద్వారా పరిచయం అయ్యారు. వారిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ మొదలై, త్వరగా ప్రేమగా మారింది. ఆగస్టులో నిశ్చితార్థం, డిసెంబర్‌లో పెళ్లి జరిపించారు. అప్పట్లో వీరి క్యూట్ జంటకు ఫాలోవర్లు ఫిదా అయ్యేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయినట్టుగా కనిపిస్తోంది.
ఇకపోతే, ఈ విడాకుల వార్తలు నిజమా? లేక కేవలం రూమర్సా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. దీనిపై వారు క్లారిటీ ఇచ్చే వరకు ఊహాగానాలు కొనసాగుతూనే ఉంటాయి.
ALSO READ: PVR INOX కి లక్ష రూపాయలు ఫైన్ ఎందుకు కట్టాల్సి వచ్చిందంటే












