మెగా మేనల్లుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు!

బ్యాక్‌గ్రౌండ్ మెద‌టి చిత్రం వ‌ర‌కే ఉప‌యోగ‌ప‌డుతుంది త‌రువాత హ‌ర్డ‌వ‌ర్క్ డెడికేష‌న్ మాత్ర‌మే మెదిటిరోజు మెద‌టి షోకి వ‌చ్చేలా చేస్తుంది. ఈ విష‌యంలో పెర్‌ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి మ‌న‌ సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ని, ఎందుకంటే ఈ రెండు ల‌క్ష‌ణాలు వున్న హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ అని సినిప‌రిశ్ర‌మ లోనే కాదు సామాన్య ప్రేక్ష‌కులు సైతం చెప్పే మాట‌.  మేన‌మామ‌లు మెగాస్టార్ చిరంజీవి, మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేనల్లుడిగా చిత్ర సీమలోకి అడుగుపెట్టిన సాయిధరమ్ తేజ్‌ కు మెగాఫ్యామిలి, మెగాభిమానులే భ‌లం అని చెప్ప‌న‌క్క‌ర్లేదు..  మెగా అభిమానుల ఆద‌రాభిమానాల‌తో త‌న‌ టాలెంట్ తో స్టార్ హీరో రేంజ్ కి చేరుకున్నారు. యాక్షన్, డాన్స్, సెంటిమెంట్, ఎమోషన్ ఇలా రకరకాల హావభావాల్ని పలికిస్తూ మాస్ హీరోగా సాయిధరమ్ మెగా అభిమానుల్నే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని సైతం అలరిస్తున్నారు. 
 
మెగా అభిమానుల అంచ‌నాల‌కి త‌గ్గ‌ట్టుగా గీతాఆర్ట్స్ , శ్రీ వెంక‌టేశ్వ‌రా క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో బ‌న్ని వాసు నిర్మాత‌గా , ర‌వి కుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో పిల్లా నువ్వులేని జీవితం అనే చిత్రం తో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యి… మెద‌టి సూప‌ర్‌డూప‌ర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఆ త‌రువాత వ‌చ్చిన రేయ్ చిత్రం లో త‌న డాన్స్ ల‌తో ప్రేక్ష‌కుల్ని మైమ‌రిపించాడు. మూడ‌వ చిత్రం గా విడుద‌ల‌య్యిన సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రంతో బాక్సాఫీస్ క‌లెక్ష‌న్ల తో త‌న రికార్డు ని క్రియోట్ చేసాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించ‌గా, హ‌రిష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం చేశారు. స‌క్స‌స్‌ఫుల్ నిర్మాత దిల్ రాజు త‌న బ్యాన‌ర్ లో సుప్రీమ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ని హీరోగా హ్యాట్రిక్ చిత్రంగా అనిల్‌ రావుపూడి ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన సుప్రీమ్ చిత్రం సాయిధ‌రమ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇలా భారీగా వసూళ్లు రాబడతున్న అతికొద్ది మంది హీరోల్లో సాయిధరమ్ తేజ్ ఓక‌రుగా నిలిచారు. ట్రేడ్ లో  మినిమమ్ గ్యారింటీ హీరో అనే ముద్ర కూడా సాయిధరమ్ పై పడింది.  దీంతో హిట్లు, ఫ్లాపులకి అతీతంగా సాయిధరమ్ కెరీర్ సాగుతోంది. 
 
విడుద‌ల‌కి సిధ్ధంగా వున్న జ‌వాన్‌
 
సుప్రీమ్ హీరో  సాయిధరమ్ తేజ్ అతిత్వరలోనే జవాన్ గా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ బివిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో సాయిధరమ్ లుక్స్ ఫ్యాన్స్ ను ఇప్ప‌టికే ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో సాయిధరమ్ సరసన టాలీవుడ్ లేటెస్ట్ లక్కీబ్యూటీ మెహరిన్ హీరోయిన్ గా నటించింది. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి స్వరాలందించాడు. ఈ చిత్రం మెద‌టి పాట‌ని సుప్రీమ్‌హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ పుట్టిన‌రోజు సంద‌ర్బంగా విడుద‌ల చేస్తున్నారు. సాయిధరమ్ రోల్ ఈ చిత్రంలో చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అరుణాచల్ క్రియేషన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం విడుదలకి సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారికంగా విడుదల తేదీ ప్రకటించబోతున్నారు. 
 
సెట్స్ పై సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్, వి.వి.వినాయ‌క్ కాంబినేష‌న్ లో భారీ చిత్రం
 
ఇక జవాన్ సెట్స్ పై ఉండగానే సాయిధరమ్ మరో రెండు సినిమాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సీకే ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై స్టార్ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ నిర్మాణ సారధ్యంలో మెగా డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ నటిస్తున్న సినిమా తాజాగా సెట్స్ పైకి వచ్చింది. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయిధరమ్ చేసిన పోరాట సన్నివేశాలకి ఫ్యాన్స్ ఫిదా కావడం ఖాయం అని చిత్ర బృందం చెబుతోంది. భారీ సెట్స్ లో ఈ సినిమా పోరాట సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఓ పవర్ ఫుల్ స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట మెగా డైరెక్టర్ వి.వి.వినాయక్. ఈ చిత్రంతో పాటు కరుణాకరణ్ దర్శకత్వంలో కూడా సాయిధరమ్ నటిస్తున్నారు. 
 
ప్రారంభ‌మైన కె.య‌స్‌.రామారావు గారు, క‌రుణాక‌ర్ చిత్రం
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన తొలిప్రేమను తలపించే రీతిన సాయిధరమ్, కరుణాకరణ్ సినిమా ఉండబోతుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మనసు హత్తుకునే ఓ ప్రేమకథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు కురణాకరణ్ ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్‌ ఓ కొత్త లుక్ తో ఫ్యాన్స్ ముందుకి రాబోతున్నారు. ఈ మూడు చిత్రాలలో పాటు మరికొన్ని చిత్రాల్లో నటించేందుకు సాయిధరమ్ ప్లాన్ చేస్తున్నారు. ఇలానే సాయిధరమ్ తేజ్ వరుస విజయాల్ని సాధిస్తూ, కెరీర్ లో మరింత ముందుకు సాగుతూ మెగా అభిమానుల్ని అల‌రిస్తూ వుండాల‌ని మనసారా ఆశిద్దాం. హ్యాపీ బర్త్ డే అండ్ ఆల్ ది బెస్ట్ టు అవర్ యంగ్ సుప్రీమ్ హీరో సాయిధరమ్.