HomeTelugu Big Storiesధనుష్ మూవీకి తెలుగులో రిలీజ్ డేట్ ఫిక్స్

ధనుష్ మూవీకి తెలుగులో రిలీజ్ డేట్ ఫిక్స్

Captain Miller release dateసంక్రాంతికి తెలుగు సినిమాలతో పోటీ పడలేక రేసునుంచి తప్పుకున్న కోలీవుడ్ మూవీ కెప్టెన్ మిల్లర్. ధనుష్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ కెప్టెన్ మిల్లర్. ధనుష్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కింది.

పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలైంది. ఈ చిత్రానికి అరుణ్ మాతేశ్వరన్‌ దర్శకుడు. తెలుగులో సంక్రాంతి సినిమాల పోటీ ఎక్కువగా ఉండటంతో థియేటర్ల కొరత కారణంగా ఇక్కడ విడుదల కాలేదు. తమిళంలో మొదటి షోతోనే హిట్ టాక్ సొంతం చేసుకుంది

తెలుగులో కెప్టెన్ మిల్లర్ మూవీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేస్తూ సురేష్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో రిపబ్లిక్ డే కానుకగా కెప్టెన్ మిల్లర్ మూవీని జనవరి 25న రిలీజ్ చేయబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తెలుగులో ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్, ఏషియన్ మూవీ వారు రిలీజ్ చేస్తున్నారు.

కెప్టెన్ మిల్లర్ మూవీలో హీరోయిన్‌గా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది. సందీప్ కిషన్, శివరాజ్‌కుమార్ కీలక పాత్రలు చేశారు. ఈ సినిమా 1930 నాటి కథాంశంతో రూపొందించిన ఈ మూవీలో ధనుష్ నటన అద్భుతం అంటున్నారు. కెప్టెన్ మిల్లర్‌గా ధనుష్ నటన వేరే లెవల్ అంటున్నారు ఆడియెన్స్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!