మరో క్రేజీ ప్రాజెక్ట్ తో క్రిష్..?

తన మొదటి సినిమా నుండి కూడా వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ ముందుకు సాగుతున్నాడు దర్శకుడు క్రిష్. రీసెంట్ గా ఆయన తెరకెక్కించిన ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాతో క్రిష్ స్థాయి పెరిగిపోయింది. ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని టాక్. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కు విభిన్నమైన సినిమాల్లో నటించడమంటే
ఆసక్తి. ఆ ఆసక్తితోనే ‘ఝాన్సీ లక్ష్మిబాయ్’ సినిమాలో నటించాలనుకుంటుంది.

నిర్మాతగా కూడా తానే సినిమా చేయాలనే ధైర్యం చేస్తోంది. కథకు సంబంధించిన వ్యవహారాలు విజయేంద్రప్రసాద్ చూసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ కథను డైరెక్ట్ చేయగలిగే దర్శకుడు ఎవరా అని ఆలోచిస్తున్న తరుణంలో విజయేంద్రప్రసాద్.. క్రిష్ పేరు సూచించినట్లుగా తెలుస్తోంది. కంగనా కూడా క్రిష్ తో కలిసి పనిచేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని
విషయాలు తెలియాల్సివుంది!