HomeTelugu Trending‘ఆకాశవాణి’ నుండి ‘దిమ్సారే’ సాంగ్‌

‘ఆకాశవాణి’ నుండి ‘దిమ్సారే’ సాంగ్‌

Dhimsare Lyrical Song Aaka

ఎస్‌.ఎస్‌. రాజమౌళి శిష్యుడు అశ్విన్‌ గంగరాజు దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆకాశవాణి’. సముద్ర ఖని, వినయ్‌ వర్మ, తేజ, ప్రశాంత్‌ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారాయన. ఈ సినిమాలోని ‘దిమ్సారే’ అనే లిరికల్‌ వీడియో తాజాగా విడుదలైంది. జాతరకి సంబంధించిన ఈ గీతం ఆద్యంతం అలరిస్తోంది. అడవి లొకేషన్లు, నటీనటుల హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకి అనంత శ్రీరామ్‌ సాహిత్యం అందించగా కాల భైరవ సంగీతం అందిచారు. అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. ఈ సినిమా జూన్‌ 4న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు దర్శకనిర్మాతలు. ప‌ద్మ‌నాభ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu