HomeTelugu Trendingనా సామిరంగ: వరలక్ష్మిగా ఆషికా రంగనాథ్ ఫస్ట్‌లుక్‌

నా సామిరంగ: వరలక్ష్మిగా ఆషికా రంగనాథ్ ఫస్ట్‌లుక్‌

Varalakshmi Intro Glimpse N

ఆషికా రంగనాథ్‌ ‘అమిగోస్’తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కథాకథనాల పరంగా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. కానీ గ్లామర్ పరంగా ఆషికా రంగనాథ్ కి మాత్రం మంచి మార్కులు తెచ్చిపెట్టింది. దానితో ఆమె ‘నా సామిరంగ’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నా సామిరంగ’. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆషికా హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమాలో ఆమె పాత్రను పరిచయం చేస్తూ .. ఒక పోస్టర్ ను విడుదల చేశారు. ఆమె పాత్రకి సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. వరలక్ష్మి పాత్రలో ఆమె చాలా అందంగా ఉంది.

ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే కథ. అద్దంలో చూసుకుని తన అందానికి తానే మురిసిపోతున్న వరలక్ష్మిని హీరో ముచ్చటగా చూడటం … అతనిని చూసి ఆమె సిగ్గుపడిపోవడం ఈ గ్లింప్స్ లో చూపించారు. కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu