HomeTelugu Trendingదర్శకేంద్రుడి 'పెళ్లిసందడి' మళ్లీ మొదలు

దర్శకేంద్రుడి ‘పెళ్లిసందడి’ మళ్లీ మొదలు

Director raghavendra rao anటాలీవుడ్‌ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మూడేళ్ల తర్వాత ఇవాళ కొత్త సినిమాను ప్రకటించారు. ఈ విషయాన్ని రాఘవేంద్రరావు నిన్న తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. చెప్పినట్లే ఆయన కొత్త సినిమా పేరును ప్రకటించారు. ‘’పెళ్లి సందడి మళ్లీ మొదలవ్వబోతుంది… తారాగణం త్వరలో…’’ అని తెలిపారు. సినిమా పేరు ‘పెళ్లి సందడి’ అని, నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు. కె.కృష్ణ‌ మోహన్ రావు సమర్పణలో రానున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. చంద్రబోస్‌ పాటలు రాయనున్నారు. దీంతో పాటు టైటిల్ లుక్‌తో కూడిన వీడియో రీలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తుంటే 25 ఏళ్ల క్రితం వచ్చిన ‘పెళ్లి సందడి’ సినిమాను గుర్తు చేస్తోంది. దర్శకేంద్రుడి సినిమా అంటేనే స్పెషల్ అట్రాక్షన్స్ ఉంటాయి. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అప్పుడే ఆసక్తి మొదలైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu