HomeTelugu Newsకల్యాణ్ దేవ్ డైరెక్టర్‌తో అల్లు శిరిష్‌!

కల్యాణ్ దేవ్ డైరెక్టర్‌తో అల్లు శిరిష్‌!

3 27
టాలీవుడ్‌లో అల్లు శిరీష్ నిదానంగా ఒక్కో సినిమాను చేసుకుంటూ వస్తున్నాడు. ఆ సినిమాల మధ్య కూడా గ్యాప్ పెరుగుతూ వెళుతోంది. తాజాగా డైరెక్టర్‌ రాకేశ్ శశితో ఒక సినిమా చేయడానికి శిరీష్ అంగీకరించాడని తెలుస్తుంది. గతంలో కల్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’ చేసిన రాకేష్ శశి, ఇటీవలే శిరీష్ కి ఒక కథను వినిపించి శిరిష్‌ ఓకే చెప్పడం జరిగిపోయినట్లు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ఈ సినిమా నిర్మించనున్నట్లు సమాచారం. లాక్ డౌన్ తరువాత ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలను వెల్లడించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu