HomeTelugu Trendingహీరోయిన్‌గా శంకర్‌ కుమార్తె 'అదితీ' ఎంట్రీ

హీరోయిన్‌గా శంకర్‌ కుమార్తె ‘అదితీ’ ఎంట్రీ

Director shankar daughter a

కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ చిన్న కుమార్తె అదితీ శంకర్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నారు. హీరో సూర్య తన తదుపరి సినిమాతో శంకర్ కుమార్తె అదితి శంకర్ ని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నాడు. 2డి ఎంటర్ టైన్‌మెంట్స్ లో నిర్మిస్తున్న ఈ చిత్రంలో కార్తీ హీరోగా నటిస్తున్నాడు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన తాజాగా వెలువడింది. ‘అదితి శంకర్‌కి సాదర స్వాగతం. మీరు అందరి హృదయాలను గెలుచుకోబోతున్నారు. దేవుడు ఆశీర్వాదాలు మీకు ఉన్నాయి’ అంటూ సూర్య ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

శంకర్ స్పందిస్తూ.. ‘ప్రియమైన సూర్య అండ్ జ్యోతిక 2D ఎంటర్ టైన్ మెంట్ ప్రై లిమిటెడ్ ని ప్రారంభించి ఎల్లప్పుడూ నాణ్యమైన సినిమాలను అందిస్తున్నందుకు ధన్యవాదాలు!’ కార్తీ .. దర్శకుడు ముత్తయ్య -రాజశేఖర్ పాండియన్ కి ధన్యవాదాలు.’ అని అన్నారు. ‘ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సూర్య సర్ #జ్యోతిక మేడమ్ గారికి చాలా ధన్యవాదాలు. మిమ్మల్ని గర్వపడేలా చేస్తాను. వందశాతం కృషి చేస్తాను’ అని అదితి తెలిపింది. ‘విరుమన్’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu