HomeTelugu Trendingవెంకటేష్‌, రవితేజలతో సినిమాలు ఆగలేదు: త్రినాథరావు

వెంకటేష్‌, రవితేజలతో సినిమాలు ఆగలేదు: త్రినాథరావు

Director trinadha rao about

‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్’, ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమాల దర్శకుడు నక్కిన త్రినాథరావు. ఈ సినిమాల తరువాత ఆయన నుంచి మరో సినిమా రాలేదు. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. వెంకటేశ్ హీరోగా కూడా ఆయన ఒక సినిమాను చేయనున్నట్టు చెప్పుకున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు ఆగిపోయాయని ప్రచారం కూడా ఇటీవల జోరందుకుంది.

ఈ నేపథ్యంలో త్రినాథరావు స్పందించారు. రవితేజ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. ఆయన ఎప్పుడంటే అప్పుడు సెట్స్ పైకి వెళ్లొచ్చు. ఇక వెంకటేశ్ తో ప్రాజెక్టు కూడా ఆగలేదు. ఆ కథ క్లైమాక్స్ గురించిన చర్చలు నడుస్తున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు తప్పకుండా ఉంటాయి .. కరోనా వలన ఆలస్యమయ్యాయి అంతే” అంటూ ఆయన క్లారిటీ ఇచ్చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu