HomeTelugu Trendingవారికంటే నా పారితోషికం 50 శాతం తక్కువ: తమన్‌

వారికంటే నా పారితోషికం 50 శాతం తక్కువ: తమన్‌

3 26
యువ సంగీత దర్శకుడు తమన్.. మిగిలిన వారితో పోలిస్తే తన పారితోషికం 50 శాతం తక్కువని అంటున్నాడు‌. 100కుపైగా సినిమాలకు సంగీతం అందించి, చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారాయన. ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న ‘అల వైకుంఠపురములో..’ కోసం పనిచేస్తున్నారు. ఈ చిత్రం జనవరి 12న విడుదల కాబోతోంది. ఇప్పటి వరకు వచ్చిన ఈ చిత్రంలోని పాటలు నెటిజన్లను విశేషంగా అలరించాయి. ఈ నేపథ్యంలో తమన్‌ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు.

‘మిగిలిన సంగీత దర్శకులతో పోలిస్తే తమన్‌తో పని ఎక్కువ అవుతుందని అంటుంటారు. దానికి కారణం ఏంటి?’ అని ప్రశ్నించగా.. ‘అదేం లేదు.. మిగిలిన వారితో పోలిస్తే నన్ను హ్యాండిల్‌ చేయడం చాలా సులభం. నేను పనిచేస్తున్న నిర్మాతలతో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మిగిలిన వారి పారితోషికంతో పోలిస్తే.. నేను తీసుకునేది 50 శాతం తక్కువ. ఇది అందరికీ తెలిసిందే. ఇలా చూసుకుంటే నేను ఎంతో ఉత్తమం. హైదరాబాద్‌లో సరైన కళాకారులు లేరు. కానీ, ఇక్కడ బెస్ట్‌ సింగింగ్‌ టీం ఉంది. అందుకే చెన్నైకి వెళ్లి రికార్డింగ్‌ చేసుకుని వస్తుంటా. క్వాలిటీ కోసం మరింత సమయం కేటాయిస్తుంటా. స్టూడియోలో అధిక గంటలు ఉండి మరీ పనిచేస్తుంటా. సినిమా చివరి రీల్‌ అమెరికా వెళ్లేంత వరకూ దర్శకుడితోనే ఉంటాను’ అని తమన్‌ జవాబు ఇచ్చారు.

అనంతరం ‘దేవిశ్రీ సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’, మీ ‘అల వైకుంఠపురములో..’ ఒకేసారి వస్తున్నాయి. మీపై ఒత్తిడి ఉందా?’ అని అడగగా.. ‘ఏ రంగంలోనైనా పోటీ ఉండాలి. అప్పుడే మన స్థాయి తెలుస్తుంది. దేవితో మాట్లాడుతుంటాను. ఆయన చేసిన 9 సినిమాలకు నేను ప్రోగ్రామర్‌గా పనిచేశా. ట్విటర్‌లో మా మధ్య సంభాషణలు జరుగుతుంటాయి’ అని తమన్‌ చెప్పారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu