HomeTelugu Trendingదివికి ఛాన్స్ ఇచ్చిన 'బంగార్రాజు' డైరెక్టర్‌‌!

దివికి ఛాన్స్ ఇచ్చిన ‘బంగార్రాజు’ డైరెక్టర్‌‌!

Divi in kalyan krishna upco
బిగ్‌బాస్‌ ఫేమ్‌ ‘దివి’ యూత్ లో మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. ఈ బ్యూటీ సోషల్‌ మీడియా చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీకి ‘బంగార్రాజు’ డైరెక్టర్‌ కల్యాణ్ కృష్ణ నుంచి పిలుపు వెళ్లినట్టుగా చెబుతున్నారు. అయితే ‘బంగార్రాజు’ సినిమా కోసం కాదు. ఆయన నిర్మాతగా చేస్తున్న మరో సినిమా కోసం. కల్యాణ్ కృష్ణ తన స్నేహితులతో కలిసి నిర్మాతగా మారాడట. ఓటీటీ కోసం సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట.

అలా ఆయన ఓటీటీ కోసం ఒక కొత్త కాన్సెప్ట్ ను రెడీ చేసుకుంటున్నాడు. ఈ సినిమాకి ఆయన స్నేహితుడైన నవీన్ గాంధీ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది. లీడ్ రోల్ కోసం ‘దివి’ని ఎంపిక చేసినట్టుగా టాక్‌. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ఏడాదిలోనే విడుదల చేయనున్నారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu