
జగన్ హయాంలో ఎన్నో వింతలు జరుగుతున్నాయి. అందులో పెద్ద వింత.. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరిగ్గా అందకపోవడం. ప్రభుత్వ ఉద్యోగి అంటే నెల నెలకు కరెక్ట్ గా జీతాలు పడతాయి అని నమ్మకం ఉండేది. కానీ జగన్ పుణ్యమా అని ఆ నమ్మకం పోయింది. అసలు ఉద్యోగులు ఏమైనా జగన్ కి బానిసలా ?, జగన్ మూడ్ ను బట్టి వాళ్ళు నడుచుకోవడానికి. వాళ్లు కూడా ప్రభుత్వంలో భాగమేనని జగన్ ఎందుకు గుర్తించడం లేదు ?, ప్రభుత్వ ఉద్యోగులు లేకుండా ప్రభుత్వ పథకాలు అమలు అయ్యే ఛాన్స్ ఉందా ?. కచ్చితంగా ఉండదు. మరీ తన ప్రభుత్వ ఉనికినీ కాపాడుతున్న ఉద్యోగస్తులకు కూడా జీతాలు సక్రమంగా ఇవ్వలేని ఏకైక ముఖ్యమంత్రి ఒక్క జగన్ రెడ్డినే.
జగన్ రెడ్డి తన పరిధులు దాటి వ్యవహరిస్తున్నాడు. ఆఖరికి ఫ్లయింగ్ స్క్వాడ్ లు పేరుతో ఉద్యోగస్తులను వేధింపులకు గురి చేస్తున్నాడు. కరెక్టే.. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉద్యోగస్తులను తీసి పడేయ్యొచ్చు. కానీ.. నీతిగా పని చేసే ఉద్యోగస్తులు ఏం చేశారు జగన్?, తెలంగాణ ఉద్యోగులకు, ఏపీ ఉద్యోగులకు మధ్య 13 వేల రూపాయల వేతనం తేడా ఉంది ?, ఈ మొత్తంతో సచివాలయ ఉద్యోగులను పోషించాలని ప్రభుత్వం భావించడం న్యాయమా ?. ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి వేతనాలు పెంచుతామని చెప్పి ఇప్పుడు ఇలా మోసం చేయడం దర్మమా ?,
రివర్స్ పిఆర్సి అమలు చేసి, ఉద్యోగస్తులకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు, హక్కుల గురించి మాట్లాడితే రోజుకో నూతన విధానాన్ని తెచ్చి వారి పై వేధింపులకు పాల్పడుతున్నారు. జగన్ ప్రభుత్వ పరిధిలోని అన్ని రకాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జగన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా తన వైఖరి మార్చుకున్నా
ఉద్యోగస్తులు వచ్చే ఎన్నికల్లో సపోర్ట్ చేస్తారనే నమ్మకం లేదు. అయినా జగన్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి గుండాలు ఉన్నారు. ఇక ఉద్యోగస్తులతో పనేం ఉంది ?,
అయినా, జీవో నెంబర్ ఒకటి పేరుతో ర్యాలీలు సమావేశాలు నిర్వహించవద్దని ఒక జీవో తెచ్చాడు. అలాగే రేపు ఉద్యోగస్తులను కూడా అణిచవేసేందుకు మరో జీవో తెస్తాడు. జగన్ రెడ్డికి ఈ జీవోలు ఏమీ కొత్త కాదు కదా. జగన్ పాలన తీరు అప్రజా స్వామికమని, రాజ్యాంగ వ్యతిరేక శక్తి అని ఎంతమంది మేధావులు ఎన్నో సార్లు మొత్తుకున్నా.. జగన్ తీరు మారకపోగా రోజురోజుకు ముదురుతోంది.













