HomeTelugu Trendingకింగ్ ఆఫ్ కొత్తపై సోషల్ మీడియాలో రూమర్లు

కింగ్ ఆఫ్ కొత్తపై సోషల్ మీడియాలో రూమర్లు

King of Kotha rumors
యంగ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్ర పోషించిన ‘కింగ్ ఆఫ్ కొత్త’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 24న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది.

జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో వేఫార్ బ్యానర్‌పై కింగ్ ఆఫ్ కొత్త చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ నిర్మించారు. ఈ మూవీకి అభిలాశ్ జోష్లీ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో దుల్కర్ గ్యాంగ్‍స్టర్‌గా ఫుల్ యాక్షన్ రోల్ చేశారు. ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దుల్కర్ మాస్ లుక్ అదిరిపోయింది. ఈ సినిమాపై ఆయన పూర్తి కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఇప్పటికే దాదాపు అన్ని భాషలకు సంబంధించిన ప్రమోషన్లను కూడా పూర్తి చేశారు.

దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త మూవీలో మరో ఇద్దరు స్టార్ హీరోల క్యామియోలు ఉన్నాయని బజ్ నడుస్తోంది. తమిళ స్టార్ హీరో సూర్య, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

రజినీకాంత్ నటించిన జైలర్ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్‍లాల్, కన్నడ హీరో శివరాజ్ కుమార్ క్యామియో రోల్స్ చేశారు. వీటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కింగ్ ఆఫ్ కొత్త మూవీలో సూర్య, పృథ్విరాజ్ ఉన్నారో లేదో రేపు రేపు సినిమా రిలీజ్ తర్వాత తేలనుంది. వారిద్దరూ ఉంటే మాత్రం ఈ చిత్రానికి మరింత హైప్ వస్తుంది.

కింగ్ ఆఫ్ కొత్త చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‍గా నటించారు. రోజ్ షబ్బీర్, ప్రసన్న, నైలా ఉష, చెంబన్ వినోద్, గోకుల్ సురేశ్, షమ్మీ తిలకన్, శాంతి కృష్ణ కీలక పాత్రలు పోషించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu