HomeTelugu Big Storiesravi teja: సోలోగానే వస్తానంటున్న 'రవితేజ'!

ravi teja: సోలోగానే వస్తానంటున్న ‘రవితేజ’!

eagle movie makers letter t

ravi teja: రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఈగల్‌’. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అనుపమపరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. కావ్య థాపర్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. మొద‌టగాసంక్రాంతి ఈ సినిమాని విడుదల చేయాలి అనుకున్నారు. అయితే సంక్రాంతి బరిలో పలు సినిమాలు ఉన్నాయి. గుంటూరు కారం, హ‌నుమాన్, సైంధ‌వ్, నా సామి రంగా సినిమాలు పోటీ పడ‌టం, థియేటర్ల కొరత ఉండటంతో ఈ సినిమాను వాయిదా వేసుకున్నట్లు వెల్లడించారు.

అలాగే ఈ సినిమాకు ‘సోలో రిలీజ్ డేట్‌’ ఇస్తామ‌ని ఫిల్మ్ ఛాంబర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థను కోరింది. దీంతో ఈ సినిమాను ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. అయితే ఫిబ్రవ‌రి 09న ఈగ‌ల్ సినిమాను విడుద‌ల చేయ‌నుండ‌గా.. దీనితో పాటు మరికొన్ని సినిమాలు విడుద‌ల కానున్నాయి. దీంతో చిత్ర విడుద‌ల తేదీపై ‘సోలో రిలీజ్ డేట్‌’ కావాలని నిర్మాణ సంస్థ ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించింది.

ఈగ‌ల్ సినిమాకు ఇచ్చిన సోలో రిలీజ్ మాటను నిలబెట్టుకోవాలని చిత్ర నిర్మాణ సంస్థ ఛాంబర్‌ను కోరింది. తమకు సోలో డేట్‌ వచ్చేలా సహకరించాలని ఫిల్మ్ ఛాంబర్‌కు లేఖ రాసింది. ఈ సినిమాలో కావ్య థాపర్, నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ సినిమాని టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు.

Image

 

 

 

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu