ఈ తెలుగమ్మాయి ‘రాగల 24 గంటల్లో’ బికినీలో కనిపిస్తుందట!

టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్లకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. అవకాశాలు వచ్చినా.. చిన్నా చితకా ఉండే అవకాశాలే తప్పించి పెద్దగా ఉపయోగం ఉండటం లేదు. అంతకు ముందు ఆ తరువాత వంటి బెస్ట్ సినిమాలో నటించిన ఈషా రెబ్బాకు అవకాశాలు వస్తాయని అనుకుంది.

ఏవో చిన్న చిన్నవి వచ్చాయి. పెద్ద అవకాశాలు దొరకలేదు. ఎలా అని ఇబ్బంది పడుతున్న సమయంలో ఎన్టీఆర్ అరవింద సమేత వచ్చింది. పాత్ర చిన్నదే పెద్దగా ప్రాధాన్యత లేదు. అయినా తన పరిధిమేరకు నటించి మెప్పించింది. ఈ సినిమా తరువాత అవకాశాలు వస్తాయని ఎదురు చూసింది.

సుబ్రమణ్యపురం సినిమా హిట్ టాక్ వచ్చినా… ఉపయోగం లేదు. ప్రస్తుతం ఈ భామ తెలుగులో రాగల 24 గంటల్లో సినిమా చేస్తున్నది. ఈ సినిమాకి శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే గ్లామర్ ఫోటో షూట్ లతో ఆకట్టుకుంటున్న ఈ హీరోయిన్, గ్లామర్ గేట్లు ఎత్తేసేందుకు సిద్ధం అయ్యింది. రాగల 24 గంటల్లో సినిమాలో బికినీ వేసుకొని నటించేందుకు సిద్ధం అయ్యింది. ఓపెనింగ్ సీన్ ను స్విమ్మింగ్ పూల్ లో చిత్రీకరించాలని అనుకుంటున్నారట. ఈ షాట్ ను ఎదో పెట్టినట్టుగా కాకుండా సినిమాలో అంతర్భాగంగా చిత్రీకరించేవిధంగా యూనిట్ ప్లాన్ చేస్తోందట.