HomeTelugu Trendingసన్నీలియోన్‌ కోసం ఫోన్లు చేస్తూనే ఉన్నారు!

సన్నీలియోన్‌ కోసం ఫోన్లు చేస్తూనే ఉన్నారు!

3 31
బాలీవుడ్‌ నటులు దిల్జీత్‌ దొసాన్జ్‌, వరుణ్‌ శర్మ, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన అర్జున్‌ పటియాలా సినిమాలో సన్నీ లియోన్ అతిథి పాత్ర చేసింది. స్పెషల్ సాంగ్‌లోనూ నటించింది. ఈ నెల 26న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ బజ్ అందుకుంది. ఈ సినిమాలోని ఓ సీన్‌లో సన్నీలియోన్‌ తన ఫోన్‌ నెంబర్‌ను దిల్జీత్‌కు ఇస్తుంది. ఆమె చెప్పిన ఫోన్‌ నెంబరును దిల్లీకి చెందిన ఓ యువకుడు పునీత్‌ అగర్వాల్‌ ఉపయోగిస్తున్నారు. నిజంగానే అది సన్నీలియోన్‌ నెంబర్‌ అనుకుని జనాలు తెగ ఫోన్లు చేస్తున్నారట. వీడియో కాల్‌ చేయాలంటూ, అసభ్యకరంగా మాట్లాడుతున్నారని పునీత్‌ మీడియాకు వెల్లడించాడు. అర్జున్‌ పటియాలా సినిమా నిర్మాతలపై కేసు వేయనున్నట్లు తెలిపాడు. రోజుకు 150 ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయని, తనను మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu