HomeTelugu News''F2' టీజర్‌

”F2′ టీజర్‌

10 9విక్టరీ వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా నటించిన మల్టీస్టారర్‌ చిత్రం ‘f2’ ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ అనేది ఉప శీర్షిక. అనిల్‌ రావిపూడి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమా నిర్మిస్తున్నారు. సంక్రాంతికి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ‘f2’ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌ ఆకట్టుకుంటోంది.

ఒక చరిత్ర గురించి చెప్పాలంటే క్రీస్తుపూర్వం, క్రీస్తుశకం అంటాం.. ఒక మగాడి గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత.. అంటు వెంకీ ఫన్నీ డైలాగ్‌తో టీజర్‌ ఆరంభమైంది.‌. ‘ఇప్పుడు ఈ పెళ్లి అవసరమా వెంకీ?’ అని రఘుబాబు అంటే.. ‘నేను మీలాగా కాదు.. పెళ్లాంని ఎలా కంట్రోల్‌ చేయాలో నాకు బాగా తెలుసు..’ అన్న వెంకీ.. ఆ తర్వాత భార్య తమన్నాతో వేగలేక ముప్పతిప్పలు పడుతూ కనిపించారు.

‘ఓ చరిత్ర చెప్పాలంటే తెలంగాణ రాకముందు.. తెలంగాణ వచ్చిన తర్వాత’ అని వరుణ్‌ తన బాధను వెళ్లగక్కే ప్రయత్నం చేశారు. ‘ఇప్పుడు పెళ్లి అవసరమా సోదరా?’ అని వెంకీ.. వరుణ్‌తేజ్‌తో అంటే.. ‘నేను నీలాగా కాదు.. పెళ్లాన్ని ఎలా కంట్రోల్‌ చేయాలో నాకు మస్తు తెలుసు’ అన్నారాయన. పూర్తి వినోదాత్మక చిత్రంగా దీన్ని రూపొందించినట్లు టీజర్‌ చూస్తే తెలుస్తోంది. ‘పండక్కి బాగా గట్టిగా నవ్వించేటట్టు ఉన్నారుగా..’ అని జయప్రకాశ్‌ రెడ్డి అంటే.. ‘అంతేగా, అంతేగా..’ అని వరుణ్‌, వెంకీ కలిసి చెప్పడం నవ్వుల పువ్వులు పూయిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu