‘జై’ పాత్రకు యాంటీ క్లైమాక్స్!

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తోన్న చిత్రం ‘జై లవకుశ’. ఈ సినిమాలో మూడు డిఫరెంట్ గెటప్స్ లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే మూడు పాత్రల్లో ఒకటైన జై పాత్రను రివీల్ చేస్తూ ఓ టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ టీజర్ లో ఎన్టీఆర్ తన డైలాగ్స్ తో అదరగొట్టేశాడు. సినిమాలో కూడా ఈ పాత్ర హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఈ పాత్రకు సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సినిమాలో జై నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పాత్రను క్లైమాక్స్ లో చంపేస్తారట. 
ఎన్టీఆర్ చనిపోవడం అనేది సినిమాకు ఓ రకంగా యాంటీ క్లైమాక్స్ అవుతుంది కానీ విలన్ ఎన్టీఆర్ కాబట్టి కమర్షియల్ ఫార్మాట్ కు తగ్గట్లుగా ఆ పాత్రను ముగిస్తున్నారని సమాచారం. మరి సినిమాలో ఎన్టీఆర్ చనిపోతాడంటే తన అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. బాబీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రాశిఖన్నా, నివేదా థామస్ లు కథానాయికలుగా కనిపించనున్నాడు. సెప్టెంబర్ నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.