HomeTelugu Trendingఎఫ్3: సెకండ్‌ సింగిల్‌ వచ్చేస్తుంది

ఎఫ్3: సెకండ్‌ సింగిల్‌ వచ్చేస్తుంది

F3 movie 2nd lyrical song o

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న మూవీ ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి దర్శకత్వం వస్తున్న సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మే 27న ‘ఎఫ్‌3’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్‌ ఫిక్స్‌ చేశారు. ఏప్రిల్ 22న ‘ఊ ఆ ఆహా’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.

ఇక ప్రస్తుతం ‘ఎఫ్ 3’ మూవీ షూటింగ్ చివరికు చేరుకుంది. ఇటీవలే పూజా హెగ్డేతో పాటు ప్రధాన తారాగణంపై ఐటమ్ సాంగ్ ను చిత్రీకరించారు మేకర్స్. ఇక సినిమాలో నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ ‘డబ్బు’ అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. మరి సెకండ్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ సమ్మర్ సోగ్గాళ్ళ రాక కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anil Ravipudi (@anilravipudi)

Recent Articles English

Gallery

Recent Articles Telugu