HomeTelugu Trending'ఎఫ్ -3' మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్

‘ఎఫ్ -3’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్

F3 movie first day collecti
విక్టరీ వెంకటేష్‌, మెగా ఫ్రిన్స్‌ వరుణ్ తేజ్ లు తమ సినీ కెరీర్ లోనే రికార్డ్ సెట్ చేసుకున్నారు. ‘ఎఫ్ -3’ సినిమా తెలంగాణ, ఏపీల్లో తొలిరోజు భారీ వసూళ్లను రాబట్టింది. నైజాంలో రూ.4.06 కోట్లు షేర్ వసూల్ కాగా.. యూఏలో రూ.1.18 కోట్లు, గుంటూరులో రూ.88 లక్షలు, నెల్లూరులో రూ.62 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.76 లక్షలు, పశ్చిమగోదావరిలో రూ.94 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.67 లక్షలు, సీడెడ్ లో రూ.1.26 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది.

మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఎఫ్ 3 తొలిరోజు రూ.10.37 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం. వెంకటేశ్, వరుణ్ తేజ్ లకు వారి కెరీర్ లో ఇదే అత్యధిక తొలి రోజు వసూళ్లు కావడం విశేషం. కాగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘ఎఫ్3’ మూవీపై మంచి టాక్ వచ్చింది. కాగా ‘ఎఫ్ 3’ సినిమాలో వెంకేటేష్ సరసన తమన్నా భాటియా.. వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా నటించారు. సోనాల్ చౌహాన్ స్పెషల్ రోల్ లో కనిపించగా.. ఐటెం సాంగ్లో పూజా హెగ్డే ఆడిపాడింది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu