HomeTelugu NewsFamily Star: విజయ్‌ దేవరకొండ ఓటీటీ డీల్ క్లోజ్

Family Star: విజయ్‌ దేవరకొండ ఓటీటీ డీల్ క్లోజ్

family star ott

Family Star: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. ఈ సినిమాలో సీతారామం ఫేం మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా చేస్తోంది. విజయ్ దేవరకొండ-మృణాల్ ఠాకూర్ కాంబినేషన్‌లో వస్తున్న తొలి సినిమా కావడంతో ఫ్యామిలీ స్టార్‌పై మంచి బజ్ ఉంది. గీతా గోవిందం సినిమా తరువా పరుశురామ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది.

తాజాగా ఫ్యామిలీ స్టార్ మూవీ ఓటీటీ రైట్స్ డీల్ క్లోజ్ అయినట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈమూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను ఈరోజు (మార్చి 19)న అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu