HomeTelugu Big Storiesనయన్‌ వీడియో వైరల్‌

నయన్‌ వీడియో వైరల్‌

6 24ప్రస్తుతం దక్షిణాదిలో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న నటి నయనతార. సాధారణంగా నటీమణులకున్న క్రేజ్‌ క్రమంగా తగ్గుతూ వస్తుంది. కానీ నయన్‌ విషయంలో మాత్రం అది రివర్స్‌ అయ్యింది. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమె క్రేజ్‌ పెరిగిపోతోంది. అగ్ర హీరోలు, కుర్ర హీరోలు అనే తేడా లేకుండా అందరి సరసన మెరుస్తున్నారు. అయితే ఈ విజయాల వెనుక నయన్‌ ఎన్నో కష్టాలు భరించారు. ఆమె నటిగా కెరీర్‌ ప్రారంభించడానికి ముందు మలయాళం టీవీ ఛానెల్‌లో యాంకర్‌గా పనిచేశారు. దీనికి సంబంధించిన 17 సెకండ్ల పాత వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. యాంకర్‌గా తన పేరు డయానా మరియం కురియన్ అని నయన్‌ (అసలు పేరు) వీడియోలో చెప్పారు. అభిమానులు, నెటిజన్లు ఇందులో నయన్‌ను గుర్తుపట్టలేకపోతున్నారు. కానీ ఆమె స్టైల్‌ మాత్రం అలానే ఉందని, స్వరం చాలా తియ్యగా ఉందని అంటున్నారు.

ఇటీవల ‘సైరా నరసింహారెడ్డి’, ‘బిగిల్‌’తో మంచి హిట్లు అందుకున్న నయన్‌ ‘దర్బార్‌’లో నటిస్తున్నారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం నయన్‌ ‘నెట్రికన్‌’ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. దర్శకుడు విఘ్నేశ్‌ శివాన్‌ నిర్మాతగా మారి తీస్తున్న తొలి సినిమా ఇది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu