HomeTelugu Trendingఆ సూపర్‌ హిట్‌ మూవీ.. సీక్వెల్స్‌ వద్దంటున్న మెగా ఫ్యాన్స్‌!

ఆ సూపర్‌ హిట్‌ మూవీ.. సీక్వెల్స్‌ వద్దంటున్న మెగా ఫ్యాన్స్‌!

Fans does not want to Ranga

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన క్లాసిక్ చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమాలో సౌండ్ ఇంజనీర్ చిట్టుబాబు పాత్రలో అద్భుతంగా నటించిన రామ్ చరణ్.. ప్రతీ ఒక్కరి అభినందనలు అందుకున్నాడు. ఇక ఈ సినిమాలో ఒక రామ్ చరణ్ మాత్రమే కాదు.. ప్రతీ పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. 2018లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్ అవ్వడమే కాక.. చరణ్ కెరీర్‌లోనే బెస్ట్ సినిమాగా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రూపొందిస్తున్నారనే వార్తలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సుకుమార్, రామ్ చరణ్ దర్శకత్వంలో మళ్లీ సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్న నేపథ్యంలో రంగస్థలం సీక్వెల్ వార్తలు వైరల్‌గా మారాయి. అయితే ఈ సినిమా సీక్వెల్ మాత్రం మాకొద్దు బాబోయ్ అంటూ మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్‌ అంటున్నారట. నిజానికి రంగస్థలం సినిమా తెలుగు తెరపై ఓ ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవాలి. అలాంటి సినిమాకు సీక్వెల్‌ని రూపొందిస్తే.. తొలి భాగంకు ఉన్న ఫ్లేవర్ పోకుండా చూసుకోవాలి. ఏ మాత్రం తేడా కొట్టినా.. సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చరణ్, సుకుమార్ కాంబినేషన్‌లో మరే సబ్జెక్ట్‌తో సినిమా తీసినా ఫర్వాలేదు కానీ, రంగస్థలంను మాత్రం టచ్ చేయవద్దని అభిమానులు కోరుతున్నారట. ప్రస్తుతం ప్రస్తుతం రామ్ చరణ్ ‘ఆచార్య’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత అతను సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా చేయనున్నాడు. సుకుమార్ ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో ఇప్పటికే సినిమాలను ప్రకటించాడు. దీంతో చరణ్-సుకుమార్ కాంబోలో ఇప్పట్లో సినిమా వచ్చే అవకాశాలు లేవు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu