HomeTelugu Trending'101 జిల్లాల అందగాడు' వచ్చేది అప్పుడే!

‘101 జిల్లాల అందగాడు’ వచ్చేది అప్పుడే!

101 jillala andagadu releas
నటుడు, ద‌ర్శ‌కుడు అవసరాల శ్రీనివాస్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ విడుదల చేశారు. ఆగ‌స్ట్ 27న ఈ చిత్రాన్నివిడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో రాచకొండ విద్యాసాగర్‌ దర్శకుడిగా పరిచయం కానున్నారు.

శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, ఎస్‌వీసీ-ఎఫ్ఈఈ బ్యాన‌ర్స్‌పై ‘దిల్‌’ రాజు, డైరెక్టర్‌ క్రిష్‌ సమర్పణలో శిరీష్, రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మించారు. బట్టతల ఉండే యువకుడి పాత్రలో అవసరాల నటించగా, ఆయన ప్రేయసి పాత్రలో రుహానీ శర్మ నటించారు. శక్తికాంత్‌ కార్తీక్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu