Homeతెలుగు Newsగోదావరి వేగంతో పోలవరం పనుల పరుగులు – గడ్డర్ల ఏర్పాటుతో స్పిల్ వే చకచకా

గోదావరి వేగంతో పోలవరం పనుల పరుగులు – గడ్డర్ల ఏర్పాటుతో స్పిల్ వే చకచకా

గత ప్రభుత్వంలా గొప్పలు చేప్పకుండ సైలెంట్గా పోలవరం ప్రాజెక్ట్ పనులు శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. తొలిసారిగా పోలవరంలో హైడ్రాలిక్ పద్ధతిలో భారీ గేట్లను చురుగ్గా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అరుదైన హైడ్రాలిక్ వ్యవస్థ ద్వారా గేట్లు పనిచేసే విధనాన్ని ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. ఈ పద్ధతిలో గేట్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన గిడ్డర్ల బిగింపు ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఇందుకోసం సోమవారం పూజలు నిర్వహించి సూచన ప్రాయంగా పనులు పని ప్రారంభించారు. ఈ రోజు నుంచి మొత్తం గిడ్డర్ల ప్రక్రియ మొదలైంది. వీటిని ఏర్పాటు చేసిన తరువాత హైడ్రాలిక్ పద్ధతిలో పనిచేసే గేట్లను బిగిస్తారు. మామూలుగనైతే ఎలక్ట్రోమెకానికల్ గేట్లనుఎత్తడం దించడం చేస్తారు. దీనివల్ల నిర్వాహణ వ్యయంతో కూడికూన్నదే కాకుండా ఐరన్ రోప్ బిగుసుకుపోయి గేట్లు వరదల సమయంలో సరిగ్గా పనిచేయకపోవడం జరుగుతూ ఉంటుంది. పోలవరం ఈ సమస్య ఎదురుకాకుండా హైడ్రాలిక్ గేట్ల వ్యవస్థను మేఘా ఇంజనీరింగ్ ఏర్పాటు చేస్తోంది.

polavaram 1

భారీ నీటి పారుదల ప్రాజెక్ట్ కు స్పిల్ వే గడ్డర్లు, పియర్స్ అమరికా చాలా కీలకమైంది. పోలవరం ప్రాజెక్ట్ ఓ స్పిల్ వే ప్రపంచంలోనే పెద్దది. దీంతో ఇక్కడి స్పిల్ వే లో చేసే ప్రతి పని కూడా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. పోలవరం స్పిల్ వే లో గడ్డర్లు కూడా గతం లో ఎక్కడ లేని విధంగా ఏర్పాటు చేస్తున్నారు. గతం లో ప్రతి చిన్న పనిని 5డి గ్రాఫిక్స్లో ప్రదర్శించి ఏదో అయిపోయింది అని నమ్మించేవారు. ఇపుడు అందుకు పూర్తి విరుద్ధంగా గ్రాఫిక్స్ లేకుండా వాస్తవాన్ని ప్రజలకు చూపించే ప్రయత్నాన్ని చేస్తోంది ప్రభుత్వం.

స్పిల్వేలోని గేట్ల ఏర్పాటు ప్రారంభం కావాలంటే మొదట ఇంటర్నల్ ఎంబెడెడ్ పార్టులు నిర్మాణ సమయంలో అమర్చటంతోపాటు గడ్డర్లను బిగించాలి. ఈ పనికి ఇప్పుడు అంకురార్పణ జరిగింది. అన్ని గేట్లకు (48) సంబంధించిన గడ్డర్ల బిగింపు పని 45-46 బ్లాకులోని పిల్లర్లపైన మేఘా సంస్ధ నిపుణులు, నీటిపారుదల అధికారులు పర్యవేక్షణలో అమర్చటం ప్రారంభమయ్యింది. ఒక్కో గడ్డర్ బరువు 62 టన్నులు. అత్యంత క్లిష్ట, కీలకమైన పని ఇది. ఒక్కో గద్దర్ పొడవు 22 మీటర్లు. గడ్దర్ తయారీకి 25 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 10 టన్నుల ఐరన్ వినియోగించారు. స్పిల్ వే పై 196 గడ్డర్లు ఏర్పాటు చేయాలి. ఇందులో 110 గడ్డర్లు ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయ్. మిగిలిన వాటిని కూడా సిద్ధం చేస్తున్నారు. గడ్డర్లు ఏర్పాటుకు నెల సమయం పడుతుంది. వీటిని రెండు నెలల్లో సిద్ధం చేశారు. ఈ గడ్డెర్ల ఏర్పాటుకు రెండొందల టన్నుల బరువు మోసే క్రేన్ వినియోగిస్తున్నారు.

గడ్డెర్లు ఏర్పాటు చేసి దానిపై రోడ్ నిర్మిస్తే భారీ వరద వచ్చిన మిగిలిన పనులు గ్యాప్ 1,3, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్లో నిరాటంకంగా చేసుకోవచ్చు. సిఎం జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఏడాదికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నారు. ఆయన సంకల్పం నిజం చేసే విధంగా మేఘా ఇంజనీరింగ్ అడుగులు వేస్తోంది. స్పిల్ వే లోని 52 బ్లాక్స్ కు సంబందించిన పియర్స్ నిర్మాణం పూర్తి కావచ్చింది. మేఘా పోలవరం నిర్మాణం చేపట్టే సమయానికి ఇవి వివిధ దశల్లో ఉన్నాయ్. అయితే మేఘా పక్క ప్రణాళికతో, కరోనా సమయంలో కార్మికులు స్వస్థలాలకు వెళ్లినా పనుల వేగమే కొంత మందగించినా ఆ తరువాత వేగం పుంజుకునేలా చర్యలు తీసుకుంది. గడ్డర్లు ఏర్పారు పూర్తి అయితే స్పిల్ వే లో మెజారిటీ పనులు పూర్తి అయినట్లే. పియర్స్ పై కాంక్రీట్ వేయటం లాంటి క్లిష్టమైన పనిని సులభతరం చేసేందుకు అధునాతన యంత్రాలను మేఘా ఇంజనీరింగ్ వినియోగిస్తోంది. చైనాలోని త్రీ గార్జెస్ డ్యాంలో 47 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించే విధంగా నిర్మిస్తే ఇక్కడ 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహించే విధంగా నిర్మిస్తుండటం విశేషం. జలాశయంలో నీటిని నిల్వ చేసి వరద వచ్చినప్పుడు కిందకు విడుదల చేసేందుకు (జల నిర్వహణ మరియు వరద నియంత్రణ) ఉపయోగపడేదే స్పిల్వే. స్పిల్వే పనిచేయాలంటే గేట్ల నిర్వహణ ముఖ్యమైనది. వాటిపై హాయిస్ట్ వ్యవస్థను ఏర్పాటుచేసి తద్వారా గేట్లను నియంత్రిస్తారు.

అలవోకగా…. వరద వేగంలా….

మేఘా సంస్థ జూన్‌ చివరి నాటికి స్పిల్‌ వే లో 1. 41 లక్షల క్యూబిక్‌ మీటర్లు, స్పిల్‌ ఛానల్‌ లో 1,11 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని, జల విద్యుత్‌ కేంద్రం ఫౌండేషన్‌ లో 3. 10 లక్షల క్యూబిక్‌ మీటర్లు, మట్టి తీసే పని 10. 64 లక్షల క్యూబిక్‌ మీటర్లు, రాయి తొలిచే పనులు 1.14 లక్షల క్యూబిక్‌ మీటర్లు, వైబ్రో కంప్యాక్షన్‌ పనులు 10. 86 లక్షల క్యూబిక్‌ మీటర్లు పని చేసింది. లక్ష్యానికి అనుగుణంగా పనులు జరుగుతున్నాయని, అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తామనే ధృడమైన విశ్వాసంతో మేఘ సంస్థ ముందుకు వెళుతోంది.

పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టును 7.2 లక్షల ఎగరాలకు సాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, 80 టీఎంసీల గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజ్ ఎగువన కృష్ణా నదికి తరలించటం, 23.44 టీఎంసీల నీటిని విశాఖ నగర తాగునీటి అవసరాలకు తరలించటం, 540 గ్రామాల్లోని 28.5 లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చేందుకు నిర్మిస్తున్నారు. ఇందులో మేఘా చేస్తున్న పనుల చాలా ముఖ్యమైనవి.

నాడు బీజం – నేడు నిర్మాణం

నాటి ముఖ్యమంత్రి, దివంగత నేత రాజశేఖరెడ్డి చొరవతో పోలవరం పనులు 2005లో మొదలయ్యాయి. కుడి ఎడమ కాలువలు అప్పుడే పూర్తయ్యాయి. ఆ కుడికాలువపైనే పట్టిసీమను ఏర్పాటుచేశారు. రాష్ర్ట విభజన సమయం లో కేంద్రం పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని తమకు అప్పగిస్తే పూర్తి చేస్తామని హామీనిచ్చింది. అయితే ఈ ప్రాజెక్టు పనులు మూడు అడుగుల ముందుకు ఆరు అడుగుల వెనక్కు అన్నట్లుగా సాగాయి.

ఏ ప్రాజెక్టునైనా జాతీయ ప్రజెక్టుగా ప్రకటించాక నిర్మాణ ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరించాలి. అప్పటికే పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం ఇపుడే అధికారంలోకి వచ్చాం ఎంత అందితే అంత నొక్కేయాలని నిర్ణయానికి వచ్చిన టీడీపీ పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిధులతో చేపట్టేలా పట్టు బట్టి అనుమతులు సాధించుకుంది. ఆ పట్టు వెనుక ఉన్న మర్మం ఏమిటో ఆ తరువాత జరిగిన పరిణామాలు, ప్రధాని అప్పట్లో చేసిన వ్యాఖ్యలతో తేటతెల్లం అయ్యింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu