నిఖిల్ పెళ్లి క్యాన్సిల్ అయిందా..?

వరుస హిట్లతో ఫుల్‌ ఫాంలో ఉన్న యంగ్‌ హీరో నిఖిల్‌, హైదరాబాద్‌కు చెందిన వ్యాపార వేత్త కుమార్తె ఆంజనేయులు యాదవ్ కుమార్తె తేజస్విని ని పెళ్లాడబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల 24న నిశ్చితార్ధాన్ని కూడా ఫిక్స్‌ చేశారు కుటుంబసభ్యులు. అయితే ఆ రోజు ఎలాంటిహడావిడి కనిపించలేదు. దీంతో ఈ ఇద్దరి పెళ్లి ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ అసలు
విషయంలోకి వస్తే.. నిఖిల్ కన్నడ రీమేక్ చిత్రం ‘కిరిక్ పార్టీ’ షూటింగ్ పనులతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో తనకు సమయం దొరకపోవడంతో కుటుంబసభ్యులు నిశ్చితార్ధాన్ని వాయిదా వేశారు. త్వరలోనే నిశ్చితార్ధాన్ని చేయడం లేదంటే డైరెక్ట్‌గా పెళ్లి చేయాలని ఇరు వర్గాలు భావిస్తున్నట్లు టాక్‌. కానీ మరికొందరు మాత్రం నిఖిల్ పెళ్లి ఆగిపోయిందని, జాతకాలు కుదరకపోవడంతో వివాహ ఆలోచనను పక్కన పెట్టేశారని చెబుతున్నారు. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో.. తెలియాలంటే నిఖిల్ స్పందించాల్సిందే!